పేట రాప్/రేప్

రాప్ అనగానే జనాలు అది ఇంగ్లిష్/అమెరికన్ వాళ్ళ ఆస్తి అనుకుంటారు.. దాన్ని అర్జంట్ గా కాపి కొట్టేసి పాపులర్ అయిన సంగీతజ్ఞులు దేశంలో చాలా మంది ఉన్నారు. చిన్నప్పుడు రెహమాన్ దాన్ని దేశికరించి “పేట రాప్” అని ట్రై చేసారు..
రాప్ అనే పదం ; ఇప్పటి రాప్పింగ్ విధానం ఆఫ్రికా నించి నల్ల వాళ్ళు అమెరికా తెచ్చారు. కాని కాన్సెప్ట్ తెలుగు దండకాల్లో ఉన్నదే. తక్కువ పరికరాలతో కేవలం అక్షరాల యతి, ప్రాస ద్వారా పాటలో రిథమిక్ ఎఫెక్ట్ తీస్కురావటమే దీని సీక్రెట్ మర్మం..

మనం (తెలుగులో ఈ అక్షరాలు చదవగలిగే మనం) యతి, ప్రాస అనగానే పారిపోతాం. రాప్ అనగానే చప్పట్లు కొడతాం.

అయితే ఈ “తెలుగు రాప్” చేసే ప్రబుద్ధులు తెలుగు పదాలని ఇంగ్లిష్ లో ఎలా ఖూనీ చేస్తారో పొద్దున్న ఒక పాట వింటే అర్ధం అయింది:
“దమ్ము” సినిమాలో “రూలర్” అని ఒక పాట. హీరో గురించి దండకం చదువుతూ పాటగాడు ఇలా అంటాడు — “ghana ghana ghana ghanudu, aganita guna ghanudu”
బుర్రలో ఉన్న తెలుగు కలయతిప్పి చూసా… “ఘనాఘన సుందరా !! పాండు రంగా !! పాండు రంగా !!” అనే ఘంటసాల పాట గుర్తొచింది.
ఘన : solid/hard
అఘన: semi-solid/soft
ఘనాఘన – used as a reference of cloud turning to liquid/rain.
ఘణఘణ- sound of bells
గణ- group

మా సుబ్బు గాడి ఫేమస్ జోక్ గోర్తోచింది.. “సీత తోక ; పివరుండు ఇట్లనియె” — సీత తోక puzzle ఏంట్రా అంటే ..
“సీతతో కపివరుండు ఇట్లు అనియె” కి వచ్చిన కష్టాలు అన్నమాట!!

అ, ఆ, గ, ఘ, న, ణ – 6 సపరేట్ అక్షరాలని .. మీ ఇష్టం వచినట్టు మార్చేస్తే భావం మారి బూతు అవుద్దిరా !
మనవి – దొంగ నా కొడకల్లరా! తెలుగు రాకుండానే ఈ పాట రాయలేదు కదా.. మరి పాడేటప్పుడు, రికార్డ్ చేసేటప్పుడు చెవులు దొబ్బాయా?

ఇక్కడ సమస్య నువ్ తెలుగులో దండకం పాడావా ? అమెరికన్ స్టైల్ లో రాప్ చేశావా? రెహమాన్ లా “పేట రాప్” చేశావా అని కాదు … భాషని రేప్ చేయకుండా పాడితే చాలు మహానుభావులారా!!

 

Chetha rap dammu : https://www.youtube.com/watch?v=eqYxwpaM4vk

Original peta rap link : https://www.youtube.com/watch?v=ME5-Cmog8uU

 

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: