iron man arc reactor తెలుగులో

iron man arc reactor చవకలో ఎలా తయారు చేయాలో internetలో చాలా వీడియోలు ఉన్నా తెలుగులో ఎవరూ try చేయలేదనుకుంటా.. సో, నేను చేస్తున్నా:

కావలసిన వస్తువులు:

– 1 Flora microprocessor (Adafruit లేదా amazon వారి వెబ్సైట్లో కొనుక్కోవచ్చు)
– 16 Ws2812 Led ring (Adafruit వారి వెబ్సైట్లో కొనుక్కోవచ్చు)
– 1 పాత ఫోను చార్జరు (నాకు కేబుల్స్ దొరకలేదు. కాబట్టి చార్జర్ వైరు లోంచి పీకాను)
– 1 మందపాటి తెల్ల కాగితం
– 1 ప్లాస్టిక్ షీట్  (మందంగా ఉంటే Effect బాగుంటుంది)
– 1 పెన్ లేదా పెన్సిల్
– 1 micro-usb కేబుల్
– 1 కత్తెర
– 1 double sided tape
– కటింగ్ ప్లైర్స్ లేదా గట్టి పళ్ళు (వైర్ల కోసం).

Software:
Ardiuno 1.6.7

 

ముందుగా మీ computerలో Ardiuno 1.6.7 ఇన్స్టాల్ చేస్కొండి. (నేను ముందు Ardiuno 1.05 తో try చేశా. కాని Flora సప్పోర్ట్ లేదు సరిగా). ఇంటర్నెట్ లో విచ్చలవిడిగా free code దొరుకుద్ది. కానీ కొంచం బుర్ర పెడితే దాన్ని hack చేయటం ఎలాగో అర్ధం అయ్యిద్ది. Ardiuno, Adafruit, Flora లాంటి పదాలు తెలుసుకున్నాక కోడ్ సంపాదించటం పెద్ద కష్టం కాదు. కాబట్టి నేను కోడ్ ఇక్కడ ఇవ్వట్లేదు.

IMG_4983

టిప్స్:

Windows అయితే port COM4 మీద Flora ని Device manager లోంచి install చేసుకోండి.

Linux అయితే dev\tty మీద mount చేస్కొండి.

—————-

Arduinoలో మీ code ని upload చేసాక mee Floraని usbకి కనెక్ట్ చేస్కుని చుడండి. Flora చిప్, Ws2812 Led  (Neopixel) ring రెండూ ఒకే సైజులో ఉంటాయి.ఇప్పుడు ఈ రెండు చిప్స్ మద్యలో ఒక మందపాటి కాగితాన్ని అదే సైజు లో కత్తిరించుకుని డబుల్ tapeతో అంటించుకోండి.

IMG_4981

IRON MAN ఎఫెక్ట్ కోసం పెన్ తో డ్రాయింగ్ వేసి, (లేదా ప్రింట్ చేసుకుని) ఆ పేపర్ ని డబుల్ tapeతో రింగ్ మీద అంటించండి.

IMG_4982

మరికొంత ఎఫెక్ట్ కోసం నేను ప్లాస్టిక్ షీట్ ని వాడాను. Acrylic అయినా OK..

Connection పద్దతి:

Flora -> Neopixel

ground పిన్ -> ground పిన్

VBATT పిన్ -> +5V

D12 -> IN

నా మొదటి టెస్ట్ వీడియో :

 

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: