Genetic Memory

జనటిక్ మెమరి :
“లూసి” సినిమా నాకో పుస్తకం లాంటిది. ఎన్నో పుస్తకాలు చదవాల్సిన అవసరం కల్పించిన సినిమా. అందులో సంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న “purpose of life”. ఒక “సెల్ ” (కణం లేదా బీజం) నించి ఎన్నో కోట్ల కణాల network అయిన మెదడు నుంచి జీవ కోటి లెవల్ వరకు చేసే ముఖ్యమైన పని “ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్”.
కొన్ని ప్రశ్నలు :
చెట్లకి కాలాలు గురించి ఎలా తెలుస్తుంది?
Instinct (సహజ ప్రవ్రిత్తి) ఎలా పుడుతుంది?
ఒక గింజ ఎప్పుడు మొలకేత్తాలో ఆ గింజ కి ఎలా తెలుస్తుంది?
పోలికలకి మూలo ఏంటి?

ఇలాంటి తిక్క తిక్క ప్రశ్నలకి సమాధానాలు ఆలోచించే తీరిక, ఓపిక లేనప్పుడు దొరికే సింపుల్ ఆన్సర్ – “దేవుడు”. అసలైన దైవ భక్తులు ఇంకో అడుగు ముందేసి ఆ దేవుడి సూత్రాలు తెల్సుకోవాలనుకుంటారు. “Principia” పుస్తకంలో Newton చెప్పింది అదే.
పైన ప్రశ్నలకి ఒక మంచి సమాధానం – “జనటిక్ మెమరి”. “DNA” అనే పదం అందరూ విన్నదే. DNA అనేది ఒక సెల్ లో ఉండే information. ఈ information ఒక సెల్ నించి ఇంకో సెల్ కి నిరంతం ప్రవహిస్తూ ఉంటాయి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ లో పాత చరిత్ర + కొత్త చరిత్ర ఉంటుంది. ఉదాహరణకి మా నాన్న కి సెల్ల్స్ వాళ్ళ నాన్న+అమ్మ నించి వచ్చాయి. ఆయన సొంత సెల్ల్స్ లో వాళ్ళ నాన్న, అమ్మ informationతో పాటు ఆయన సొంత అనుభవాలు కుడా ఉంటాయి. చలి, ఎండా, వాన, వాసన, రుచి, భయం ఇలాంటివి మామూలు విషయాలు ; యుద్ధం, ప్రకృతి విపరీతాలు, ప్రమాదాలు, రోగాలు, రేడియేషన్ లాంటి స్పెషల్ information కూడా అన్నమాట!
“లూసి”కి తన తల్లి కడుపులో ఉన్నప్పటి జ్ఞాపకాలు కుడా ఉంటాయి. మన అభిమన్యుడి కథ ఇంచుమించు అలాంటిదే. “గత జన్మ” అనేది ఒక సూడో థీరి అనుకుంటే, మన “ancestors” జ్ఞాపకాలు మనకి సెల్ లెవెల్ లో నిక్షిప్తం అయ్యి ఉంటాయి అనేది సైన్స్. దీన్ని బౌద్ధంలో “బీజ విజ్ఞానం” (8th level of consiousness) అంటారు.
“లూసి” అందుకున్న విజ్ఞానమే బుద్దుడు కూడా అందుకొని ఉంటాడు. అందుకే బుద్ధుడు చెట్ల తోనూ, అన్ని జీవ రాసులతొనూ మాట్లాడగలడు అని ఒక గాసిప్/నమ్మకం.

అసలు నా బుర్రలో ఈ ఆలోచనల ప్రవాహం ఎలా మొదలయ్యిందో ఒక సిల్లీ పిట్ట కథ.
“Arrow” కథ లో హీరో “League of Assassins”లో చేరతాడు. “Ras al ghul” ఎన్నో తరాలుగా బతికి ఉన్న సూపర్ విలన్. హీరో Arrow చివరకి Ras al ghul ని చంపేసాక, నేను Batman కథ మొదలెట్టా. ఇక్కడ దీన్ని “League of Shadows” అంటారు. సేం Ras al ghul ఇక్కడ విలన్. Ras al ghul కూతురు Nyssa al ghul కత్తి లా ఉంటుంది. ఆ కత్తిని పక్కన పెట్టి పిట్ట కథలోకి వస్తే, మన Batman, Ras al ghulకి శిష్యుడు. (Arrow కూడా ఒక రకంగా శిష్యుడు, అల్లుడు) . Starling సిటిని నాశనమ్ చేయటానికి వస్తే రక్షించటం Arrow కథ; Gotham సిటిని నాశనమ్ చేయటానికి వస్తే రక్షించటం Batman కథ. రెండిటికి కామన్ – League of Assassins. అసలు వీళ్ళ గోల ఏంటో తెల్సుకోటానికి సంకల్పించా. అప్పుడు చదివిన కథ “Assassin’s Creed”. ఇందులో హీరో తన ముత్తాతల ముత్తాతల ముత్తాత అయిన 15 శతాబ్దపు “Aguilar” అనే Assassin(Professional Killer) జ్ఞాపకాలు వస్తాయి. ఇది ఎలా సాధ్యమా! అని అలొచిస్తూ ఉండగా.. పైన ఆలోచనల ప్రవాహం మొదలై keyboard మీదకి ఇలా వచ్చింది..

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: