“హంస గీత”నే వినరాదా -a review of a line in manassa ekkadunnav.

“హంస గీత”నే వినరాదా.. హింస మానరా మదనా..
ఒక మామూలు romantic పాట లొ “హంస గీత” గురించి మాట్లదటం వేటూరి వారికే చెల్లింది ..
సామాన్య జనులకు ఆయన సాహిత్యం అర్ధం కావలి కదా!!

కృష్ణుడు అర్జునిడికి చెప్పింది భగవద్గీత.
కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పింది హంసగీత.

పాండవులందరూ పొయాక(స్వర్గారోహణ తర్వాత), కృష్ణుడు కేవలం ఉద్ధవుడికి మాత్రమే Goodbye చెప్పాడు.
అందుకని కవులు “హంసగీత పాడటం”, “హంసగీత చెప్పటం” అన్నప్పుడు అది Goodbye message అన్నమాట!

వేటూరి గారి భావం – ఇంక ఈ శ్రింగార హింస ఆపరా బాబూ,. హంస గీత పాడెయ్యి. ఇక సెలవు!!
ఆమర్ రహొ వేటూరి!!
——————————–

భారతం లో ఇంకా చాలా గీతలు ఉన్నాయి.
హంస గీతనే ఉద్ధవ గీత అంటారు
వ్యాధ గీత – వన పర్వంలో ఒక కసాయి వాడు ధర్మరాజుకి చెప్పింది
అను గీత- కురుక్షేత్ర యుద్ధం అయిపొయాక అశ్వమేధ పర్వంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది
కామ గీత – అశ్వమేధ పర్వంలో కృష్ణుడు యుధిష్టురుడికి చెప్పింది
పింగళ గీత – శాంతి పర్వంలో హంస గీత లో భాగంగా పింగళ అనే వేస్య చెప్పిన గీత
శంపాక గీత – శాంతి పర్వంలో శంపాక అనే వాడి నీతి కథ భీష్ముడు యుధిష్టురుడికి చెప్పింది.
మంకి గీత – శాంతి పర్వంలో మంకి అనే ముని యొక్క నీతి కథ భీష్ముడు యుధిష్టురుడికి చెప్పింది.
బొద్య గీత – శాంతి పర్వంలొ బొద్య ఋషి యయాతికి చెప్పింది.
విచక్ను గీత – శాంతి పర్వంలో విచక్ని అనే రాజు యొక్క నీతి కథ భీష్ముడు యుధిష్టురుడికి చెప్పింది.
హారిత గీత – శాంతి పర్వంలో సన్యాస ధర్మం గురించి హారిత ముని చెప్పినత్తు భీష్ముడు యుధిష్టురుడికి చెప్పింది.
వ్రిత్ర గీత – శాంతి పర్వంలో వ్రిత్రాసురుడికి శుక్రాచార్యుడు చెప్పింది.
పరాశర గీత – శాంతి పర్వంలో జనకుడుకి(సీత తండ్రి) పరాశరుడు (వ్యాసుడి తండ్రి) చెప్పింది.

ఇవి కాక రామాయణం ఉత్తరా కాండ లో సీతని అడవిలో విడిచాక బాధ పడుతున్న లక్ష్మణుడికి రాముడు ఉపదేశం – రామ గీత

ఇంకా శివుడు పార్వతి కి చెప్పింది (వ్యాసుడు రాసాడు అని కొందరి వాదన విస్వసర తంత్రంలోది అని కొందరి వాదన)  – గురు గీత 

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: