సంక్రాంతి లక్ష్మి

మా ఇంటికి సంక్రాంతి లక్ష్మి “క్యార్” “క్యార్” మని అరుస్తూ వచ్చింది ..
మీ మీ ఇళ్ళకి కుడా మీకు తగిన విధంగా రావాలని ఆశిస్తూ,
మీకు సంతొషాన్ని ఇచ్చేదే మీ సంక్రాంతి లక్ష్మి అని గుర్తు చేస్తూ ..
కొందరికి పాడి పంటలు, చుట్టాలు,
కొందరికి కొత్త కాపురాలు,
కొందరికి కోడి పందాలు,
లేదా అదే కోడి మాంసం,
కొందరికి ముగ్గులు, గొబ్బెమ్మలు, పాయసాలు
కొందరికి భోగి పళ్ళు,
ఇలా, ఎవరి ప్రాప్తం బట్టి వారికి,
ఆన్ని అందరికి లేవు అనే చింతని వదిలేసి ..
కాలం మారుతోంది, కాబట్టి కొన్ని ఉంటాయి, కొన్ని పొతాయి అని గుర్తెరిగి
మీకు ఈ సంక్రాంతి కి ఏమి ప్రాప్తమో,
దానికి ఆ సూర్య నారాయణుడికి, ఆ సంక్రాంతి లక్ష్మికి స్తోత్రం చేస్తూ ..
(మీరు ఇస్లాం అయితే, నమాజ్ చేస్తూ, మీరు క్రైస్తవులు అయితే ప్రార్దన చేస్తూ)
పెద్దలని గుర్తు చేస్కుంటూ,
సుభ్రంగా తాగి, తిని, సినిమాలు చూసి, పండగ చేస్కొవాలని …

శుభాకాంక్షలతో
మీ
సంక్రాంతి

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a comment